మంగళవార్త దినోత్సవ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
24 Mar 2025
మంగళకరమైన మాతృత్వ వార్తను
దూత తెలుప మురిసె మాత మరియ!
మర్త్య లోకమునకు మనుజ కుమారుండు
అడుగు పెట్టు వార్త అద్భుతమ్ము!
సుతుడు మనుజుడైన శుభవేళ మదినెంచి
ఎల్ల జనులు మిగుల ఉల్లసించ
తమను ఉద్ధరించు తరుణమ్మును తలచి
ఆత్మ లెల్ల యెంతొ సంతసిల్లె!.