తపస్సుకాల ఆచారణ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ మాటల్లో

సిస్టర్ దీప్తి
24 Mar 2025
ఈ అపర క్రీస్తు తపస్సుకాలంలో ఎక్కువ సమయాన్ని ప్రార్ధనలో ఒంటరిగా గడిపేవారట.క్రీస్తు శ్రమలను, పరలోక విషయాలను ధ్యానిస్తూ గడిపేవారట.కొన్నిసార్లు ఆయన తినడం, నీళ్ళు తాగటం కూడా మరిచిపోయే వాడట.ఓ చిన్న రొట్టె ముక్కలో సగం తింటూ తపస్సు కాలం అలా అలా గడిపేవాడట. ఇది ప్రభు వారికి ఇచ్చిన ప్రత్యేక వరం.కాబట్టి ఇటువంటి వరాన్ని ప్రభునే మనకు ఇవ్వాలి. మన నుండి వేరే విధమైన ఉపవాసాన్ని ప్రభువు కోరుకుంటే అది చేయటమే ఉత్తమం, మన శక్తికి మించి ప్రభువు శోధించరు కదా?
పునీత అగస్టీను
పాపంలో కొట్టు మిట్టాడుతున్న మనకు పునీత అగస్టీను గొప్ప ఉపశమనం కదా!! ఈ పునీతునికి వీరాభిమానులు ఎక్కువే.అయితే వీరు తపస్సుకాలంలో చేసిన కార్యం, తాను నొప్పించిన వారి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరడం, శత్రువుల కోసం ప్రార్థించడం, ఈ రెండు పనులు చేయాలంటే గుండెల్లో దమ్ముండాలి మరి క్రీస్తుని ప్రేమ, వినయం ఒక మనిషి ఆత్మలో ఎంతగా నిండి ఉంటే ఈ ఉన్నత ఆలోచన తట్టుతుందో ఇక ఆలస్యం చేయకుండా, ధైర్యంతో, మనం గాయపరిచిన వారి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుదాం మీన శత్రువుల కోసం ప్రార్ధించుదాం . వాళ్ల మనసును గాయపరచన పొరపాటు మనదే కదా! కాబట్టి క్షమాపణ అడుగుదాం! ప్రభువు సంతోషిస్తారు.