తపస్సుకాల ఆచరణ ,పునీత ఇన్యాసి మాటల్లో

సిస్టర్ దీప్తి
21 Mar 2025
పునీత ఇన్యాసివారు తపస్సుకాలం కోసం ప్రత్యేకించి ఏమీ చెప్పకపోయినా వారు రచించిన తపోభ్యాసాలు అన్న గ్రంథంలో మూడవ వారంలో క్రీస్తుని శ్రమలు,పాటులను,గురించిన ధ్యానాంశాలను ప్రతిపాదిస్తూ వాటిని ఆచరించడం ద్వారా క్రీస్తుతో ఏ విధంగా ఐక్యం కావాలో తెలియజేస్తాడు. క్రీస్తుని శ్రమలను ధ్యానించేటప్పుడు క్రీస్తు మన కోసం ఎంతో గొప్ప శ్రమను అనుభవించాడు కాబట్టి నేను కూడా అదే విధమైన బాధను, పరితాపాన్ని, అలజడిని చవిచూడాలని కోరుకోమని సలహా ఇస్తాడు (నెం. 1931) అంతేకాక ! నా కోసం తన దేహాన్ని అర్పించి,రక్తాన్ని చిందించి, రక్షణ గావించాడు. కాబట్టి నేను కూడా ఆయన శ్రమలను జూచి కన్నీరు కార్చాలని బోధించాడు.ఈ విధంగా క్రీస్తుని శ్రమలలో పాలుపంచుకొనునప్పుడు తాను తినే ఆహారంపై దృష్టి ఎక్కువగా పెట్టకూడదని చెప్పి మితంగా భుజించడంపై మార్గదర్శకాలను అందిస్తాడు. క్రీస్తుని శ్రమలను గూర్చిన ఇన్యాసివారి భావాలు మనం చేపట్టే తపస్సుకాల ఆచరణలకు అధికమైన అర్థాన్ని చేకూర్చగలవు.