కాల సూత్రం

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

23 Feb 2025

నిప్పులన్ రగిలించు నోడే
గొప్పగా మన గల్గువాడై
నేలపై నిలదొక్క గల్గెను
కాల సూత్రం మహా మంత్రం !
కాదనే దమ్మున్నదా మరి ?
కొట్ట గలిగీ త్రొక్కు వాడే ,
మెట్ట గల డే పదవి నైనా !!
వినయముగ మెడ వంచి చూడూ
అణచరో పాతాళ మగుపడ ?
ముల్లుతో తెగ గిల్ల గల్గిన
జిల్లు జిల్లన కళ్ళు తెరుతురు
భళ్ళునన్ తెల్లారునో కద !
వెల్లువై ప్రవహించు వెలుతురు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN