పోప్ క్షేమంగానే ఉన్నారు

జోసెఫ్ అవినాష్
20 Feb 2025
ఇటీవల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చేరిన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం అవుతోంది.ఆయన హెల్త్ బులెటిన్‌ను ఎప్పటికప్పుడు డాక్టర్లు ప్రకటిస్తున్నారు.అయితే పోప్ ఆరోగ్యం బాగానే ఉందని, ఇప్పుడు నార్మల్‌గానే ఉన్నారని ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని (Giorgia Meloni) చెప్పారు. ప్రస్తుతం ఆయన రోమ్‌లోని జెమెల్లీ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో శుక్రవారం పోప్‌ను హాస్పిటల్‌లో చేర్చారు.
హాస్పిటల్‌లో ఉండగా,పోప్‌ను పరామర్శించిన తొలి వ్యక్తి మెలోని. ఆయన చాలా అలర్ట్‌గా ఉన్నారని,ట్రీట్‌మెంట్‌కు రెస్పాండ్ అవుతున్నారని ఆమె వెల్లడించారు.ఎప్పటిలాగే జోకులు చెబుతూ అందరినీ నవ్విస్తున్నారని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ,ఆయన ఏమాత్రం భయపడట్లేదని తెలిపారు.