విశాఖ అగ్ర పీఠాధిపతిగా ఎన్నికైన ఉడుమల బాల గారు

జోసెఫ్ అవినాష్
08 Feb 2025
ప్రస్తుతం వరంగల్ పీఠ కాపరిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహా ఘన.ఉడుమల బాల తండ్రి గారిని విశాఖ అగ్రపీఠానికి పీఠ కాపరిగా ఎన్నుకుంటూ జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ ఉత్తర్వులు జారీ చేశారు.ఉడుమల బాల గారు ఫిబ్రవరి 20, 1979లో గురువుగా అభిషేకించబడ్డారు.1994 నుండి 2002 వరకు హైదరాబాద్ పీఠం, రామంతపూర్ లోని పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయ వేదాంతాచార్యునిగా,రెక్టార్‌గా 2006 నుండి 2013 వరకు అఖిలభారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య ఉప ప్రధాన కార్యదర్శిగా,2015 నుండి 2023 వరకు తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య దైవ పిలుపులు, గురువులు, గృహస్థ క్రైస్తవుల సేవా విభాగానికి అధ్యక్షునిగా, 2022 నుండి 2024 వరకు ఖమ్మం పీఠానికి అపోస్తొలిక పాలనాధికారిగా తన విశిష్ట సేవలందించారు.తండ్రిగారి పాలనలో విశాఖ అగ్రపీఠం బహుగా అభివృద్ధి చెందాలని, ఆ దేవాది దేవుడు తండ్రి గారికి ఆయురారోగ్యాలను, శక్తిని అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ, భారతమిత్రం యాజమాన్యం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నది.