దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించారు?

కతోలిక శ్రీసభ సత్యోపదేశం

06 Feb 2025

"దేవుని మహిమార్థమే లోక సృష్టి జరిగినది"
(ప్రథమ వాటికన్ మహాసభ).
(క.శ్రీ.సత్యో 293-294,319)

దేవుడు ఈ లోకాన్ని సృష్టించడానికి గల ఒకేఒక్క కారణం ప్రేమ! ప్రేమతోనే దేవుడు ఈ లోకాన్ని సృష్టించారు.దైవప్రేమపూరితమైన ఈ సృష్టిలోనే దేవుని గౌరవ మహిమలు దర్శనమిస్తూ ఉంటాయి.అలా సృష్టిలో దేవుని దర్శిస్తూ ఆయనను హృదయపూర్వకంగా స్తుతించాలి.అయితే - దేవుని స్తుతించుటము అంటే కేవలం సృష్టికర్తగా దేవుని పొగడటం కాదు. ఆయనకు భక్తిభావంతో కృతజ్ఞతలు తెలుపాలి. అవును ప్రతి మనిషి ఈ అద్భుత సృష్టిలో తన ఉనికిని తలచుకుంటూ, దైవప్రేమపూరితమైన విశ్వసృష్టిని గురించి ధ్యానిస్తూ, నిత్యమూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN