బలమైన సమాజాన్ని నిర్మించండి- పోప్
జోసెఫ్ అవినాష్
25 Jan 2025
జనవరి 24 పాత్రికేయుల పాలకు పునీతుడైన పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారి పండుగను శ్రీసభ సామాజిక సమాచార దినోత్సవం గా జరుపుకుంటుంది.ఈ సందర్భంగా పోప్ సందేశాన్ని అందించారు.ఆయన మాట్లాడుతూ! పాత్రికేయులు నకిలీ వార్తలను నిరోధిస్తూ,మంచిని వ్యాప్తి చేయడానికి విశేష కృషి చేయాలని ఆయన కోరారు.అశాంతి ఉన్నచోట శాంతిబీజాలను వెదజల్లాలని ఆయన కోరారు. ప్రజలను చైతన్య పరిచే సమాచారాన్ని అందించాలని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్ష, సమస్యలపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని, ఒక బలమైన సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేయాలని ఆయన రచయితలను, పాత్రికేయులను కోరారు.