21 మంది చిన్న బిడ్డలకు జ్ఞాన స్నానమిచ్చిన పోప్
జోసెఫ్ అవినాష్
15 Jan 2025
క్రీస్తు బాప్తిస్మ ఉత్సవాన్ని పురస్కరించుకొని,జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్,21మంది చిన్నారులకు జ్ఞానస్నానమిచ్చి వారిని క్రైస్తవ విశ్వాసంలోకి స్వాగతించారు.మనం జరుపుకునే ఈ బాప్తిస్మ ఉత్సవంలో ప్రధాన పాత్రధారులు చిన్నారులేనని, నిష్కళంకమైన పసి హృదయాలు దైవ విశ్వాసాన్ని ఎలా స్వీకరించాలో మనకు నేర్పిస్తున్నారని ఆయన అన్నారు.చిన్న బిడ్డల జ్ఞానస్నాన జీవితానికి సాక్షులుగా నిలుస్తున్న జ్ఞాన తల్లిదండ్రులను ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ! జ్ఞాన తల్లిదండ్రులు చిన్న బిడ్డల ఆధ్యాత్మిక జీవితంలో అండగా ఉండాలని వారిలో దైవజ్ఞానాన్ని పెంపొందిస్తూ దైవ బిడ్డలుగా తీర్చిదిద్దాలని కోరారు.అలాగే తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ!జ్ఞానస్నానం స్వీకరించిన ఈ రోజుకు ఒక పరమార్ధాన్ని చేకూరుస్తూ,ప్రతి ఏటా దీన్ని ఒక పుట్టినరోజు వేడుకల జరపాలని,చిన్న బిడ్డలకు సువిశేష విలువలు నేర్పిస్తూ,దేవుని వారసులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరుతూ,జ్ఞాన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియపరిచారు.