ఈనాటి సువిశేష సారాంశం,పద్యరూపంలో
శ్రీమతి బి. మేరీ సుశీల
19 Nov 2024
తేది 20-11-2024
బుధవారం
లూకా19:11-28
ఈనాటి సువిశేషసారాంశం
(పద్యరూపంలో)
-------------------------------
తేగీ.
గొప్ప వంశస్తు డొక్కడు కోరితనదు!
గౌరవపు రాజ్య పెంపుకై దూరమెడలె!
తనదుపదిమంది దాసుల
దనర బిలిచి!
తలకొకటి నాణె మును ఇచ్చి తమతొ చెప్పె!
మీరు వ్యాపారమును జేయ కోరు చుంటి!
తేగీ.
ప్రజలు నమ్మక ద్వేషించి పంపిరతని!
రాజ్య విస్తరణనుజేసి వచ్చి యతడు!
ధనము నిచ్చిన దాసుల దయనుబిలిచి!
ఏమివ్యాపార లాభాలు ఎటుల నుండె!
తేగీ.
మొదటి వాడొచ్చి మీరిచ్చిన ధనము గొని
ఇంక పదినాణె ములనేను
గొంటినయ్య!
అందుకెజమాని నమ్మిన బంటు నీవు!
స్వల్ప విషయము లందున శ్రద్ధ చేస్తి!
పది నగ రులలో అధిపతి పదవినిడితి!
తేగీ.
రెండవ పనివాడటులనే
ఇంక నైదు!
నాణెములుగొంటి ననగానె నగరులైదు!
నకును అధిపతి గావింతు
ననుచుపలికె!
మూడవ పనివా డెట్లన ? మూటకట్టి!
తెచ్చితినినీదుసొమ్మును
తీసి కొనుము!
తేగీ.
నీవుకఠినుడవనితెల్సి
నీభయమున!
విత్తకుండనెకోసెడిబుధ్ధినీది
అనగయజమానివుగ్రుడై
అనియెనిటుల!
అయిన వడ్డీకియెందుకు
యీయకుంటి?
వడ్డితోసహ తీసికొనుండె
వాడ!
తేగీ
వానివద్దనున్నట్టిది
వానినుండి!
తీసిపదినాణెములుగల
వానికిండు!
వున్న వానికేయింకను
వుంచబడును!
లేనివానికి వున్నదీలేక
పోవు!