ప్రస్తుతించిరిశిష్యులు ప్రభునిమహిమ!
శ్రీమతి బి. మేరీ సుశీల
17 Nov 2024
తేది 18-112024
సోమవారం
మత్తయి14;22-33
ఈనాటి సువిశేష సారాంశం
( పద్యరూపంలో)
------------------------------
తేగీ.
యేసు శిష్యులు పడవలో
యేగుచుండ!
గాలి ప్రతికూల దిశ వీచ అలలు ఎగసె!
పడవ చాలదూ రంబుగా నెట్టబడెను!
తెల్లవారు ఝామున ఏసు అలల పైన!
నడచి వచ్చుట గమనించి జడిసె మిగుల!
తేగీ.
భూతమని కేక లేయగ నంతప్రభువు!
భయపడక ధైర్య మొందుడి ప్రభును నేనె!
నిజముగా నీవె అయినచో నీట నడువ!
ఆననిడుమని పేతురు అడిగెప్రభుని!
తేగీ.
రమ్ము అనగానే పేతురు
రయము గాను!
పడవ దిగినీటి మీదనే నడవసాగె!
గాని గాలికి భయపడి మునిగిపోతు!
నన్ను రక్షించుము ప్రభువా అనుచునరచె!
తేగీ.
చేయి అందించి పేత్రును పయికిలేపి!
"అల్ప విశ్వాసి ధైర్యము ఏలచెడితి?"
అంత గాలియు అణగె ప్రశాంతమాయె!
ప్రస్తుతించిరిశిష్యులు ప్రభునిమహిమ!