మెలకువతో ఉన్నారా?

జోసెఫ్ అవినాష్

21 Oct 2024

సామాన్య 29వ మంగళవారం
సువిశేష ధ్యానం:
లూకా 12:35-38
ఈనాటి సువార్తలో ప్రభువు కోరకు జీవింపవలెనని, మెళుకువగా నుండుమని, నడుములు కట్టుకొని, దీపములు వెలుగుగించమని ప్రభువు హెచ్చరించారు. యేసుక్రీస్తు మనకు తెలియని గడియలో వచ్చును. “మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును" (లూకా 12:40, మత్తయి 24:44) “ఆ సమయం గూర్చి తండ్రికి తప్పు పరలోక దూతలుగాని, కుమారుడుగాని, మరెవ్వరునుగాని ఎరుగరు" (మార్కు 13:32-33), ఆయన ప్రొద్దుక్రుంకువేళ వచ్చునో. అర్థరాత్రివేళ వచ్చునో. కోడికూయునప్పుడు వచ్చునో మరియు తెల్లవారుజామున వచ్చునో మనకు తెలియదు. ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు కనుక మెళుకువగా ఉండమని దేవుడు మనలను హెచ్చరిస్తున్నారు. అంతేకాదు సిద్ధంగా ఉండాలని మన నడుములు కట్టుకొని ఉండాలని కోరుతున్నారు. ఈ లోకము నీ విరోధి అయినట్లుగా పారిపోవుటకు సిద్ధముగనుండుము. ఈ లోకము మనకు విరోధి కానిచో అది సమాధి పెట్టెయగును. "కాబట్టి మన మనస్సు అను నడుము కాట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల వారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనతో కలసి పరలోకం చేరాలి. ఈ జీవితంలో మన ఆత్మను దైవాత్మతో వెలుగింపబడనీయాలి. దీపములను రాత్రి యంతయు వెలిగించెదము. పాపాంధకారమున విశ్వాస జీవితము జ్యోతివలె వెలుగుచుండవలయును. ఈ దీపము ఏమిటి? నరుని ఆత్మ యోహావా పెట్టిన దీపము" సామెతలు 20:27. ప్రతి విశ్వాసి క్రీస్తు చేత వెలిగింపబడిన దీపము. ఆయనతో నిత్యం జీవించాలి. విశ్వాసంతో వెలుగొందాలి, ఆవెలుగులో నిత్యం ప్రయణం చేయాలి. అప్పుడే మనం పరలోక రాజ్యం చేరుతాము. కనుక ఈ భులోకములో నిత్యం మెళుకువగా జీవించాలి

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN