నేటి సువిశేష సారాంశం, పద్య రూపంలో

శ్రీమతి బి. మేరీ సుశీల

21 Oct 2024

తేగీ.
లోకమునకు తావిచ్చిన లోభమందు!
బెంగలేక జీవించిన భంగపడును!
నశ్వరంబైన ఇహలోక జీవి కన్న!
శాశ్వతంబైన జీవమే శరణమగును!

తేగీ.
ధనమె సర్వస్వ మనుకొనేఘనులకొరకు!
యేసు చెప్పెను ఉపమాన మీ విధముగ!
భూమి పండించు కామందు పుష్కలంగ
పంట పది రెట్లు పండించి పదిల పరచ!

తేగీ.
కొట్లు చాలక గోదాము లెల్లనింపి!
స్వగత మునపల్కె పెక్కేండ్లు చల్లగాను!
ప్రాణమా తిను త్రాగు
సుఖాన తేలు!
అనుచుభావించు వెర్రికి ఆది గురువు!

తేగీ.
ధనికుడానేడు నువుజావ ధనము వలన!
ఫలితమేమైనకలుగునా తెలియబలికె!
పరము నందునధనమును కూర్చుకొనుము!
నిత్య జీవము నొసగును నీకు నదియె!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN