మన విశ్వాసాన్ని ఇతరులకు ఎందుకు ప్రకటించాలి?

కతోలిక శ్రీసభ సత్యోపదేశం

20 Oct 2024

యేసుప్రభువు ఆదేశించారు గనుకనే మనం విశ్వాస సత్యాలను ప్రబోధిస్తున్నాం: "మీరు వెళ్లి సకలజాతి జనులను నా శిష్యులను చేయుడు" (మత్తయి 28:19). (91)

నిజమైన క్రైస్తవులెవరూ విశ్వాస ప్రకటన బాధ్యతను ఇతరులకు వదలిపెట్టరు. బోధకులు, పాస్టర్లు, మిషనరీలు మాత్రమే విశ్వాస ప్రకటన ధర్మాన్ని నిర్వర్తిస్తారని సరిపెట్టుకోరు. నిజానికి మన చుట్టూ ఉన్న ఇతరుల ఎదుట మనమే క్రీస్తు ప్రతినిధుల్లా క్రీస్తు ప్రతిరూపాల జీవించాలి. అంటే - నిజమైన ప్రతి క్రైస్తవుడూ తన సాటి మానవులందరు దేవుణ్ణి తెలుసుకోవాలనీ, వారు కూడా దైవసాక్షాత్కారం పొందాలన్నీ కోరుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు తనతో తానిలా చెప్పుకుంటాడు. "ప్రభువుకు నా అవసరం ఉంది. నేను జ్ఞానస్నానం పొందినవాణ్ణి. పవిత్రాత్మ ధ్రువీకరణసంస్కారం పొందాను. నా చుట్టూ ఉన్న ప్రజలు దేవుని గురించి తెలుసుకొనేటట్లు చేసే బాధ్యత నా మీద ఉంటుంది అలాగే అందరు 'సత్యమును తెలిసికొనేటట్లు' నేను చేయాలి" (1 తిమోతి 2:4). ఈ సందర్భంలోనే మదర్ థెరిస్సా ఒక మంచి ఉదాహరణ చెబుతూండేవారు: "వీధి పొడవునా విద్యుత్ తీగలు సమాంతరంగా వేసి ఉంటాయి. అయితే వాటిల్లో విద్యుత్తు ప్రవహించినపుడే విద్యుత దీపాలు వెలుగుతాయి, లేకుంటే వెలగవు. మీరూ నేనూ విద్యుత్ వంటి వాళ్లం. మనలో ప్రవహించే విద్యుత్తు దేవుడు. మన ద్వారా దేవుణ్ణి రొట్టె విరుచుట యందును, ప్రార్థించుటయందును" ఎడతెగక ఉండేవారు (అ.కా 2:42). తొలి సంఘాల క్రైస్తవులు పరస్పరం సఖ్యతతో జీవించేవారు, ఏకతాభావంతో మెలగేవారు. అలాగే తమ సంఘంలో ఎప్పటికప్పుడు ఇతరులకు చోటు కల్పించేవారు. అదే సంప్రదాయం శ్రీసభలో నేటికీ కొనసాగుతూనే ఉంది. కతోలిక శ్రీసభలో అపోస్తలుల కాలం నుంచి వస్తోన్న సంప్రదాయం ప్రకారం- క్రైస్తవులు దేవునితో తాము గడిపే సహవాసం లోనికి అన్యులను సైతం ఆహ్వానిస్తూ ఉంటారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN