అధికార వ్యామోహం - సిలువ పరమార్ధము

ఫాదర్ గోపు ప్రవీణ్

19 Oct 2024

29వ సామాన్య ఆదివారము, Year B
యెషయ 53:10-11;
హెబ్రీ 4:14-16;
మార్కు 10:35-45
ధర్మ, అర్ధ, కామ, మోక్షలు పురుషార్ధాలు అని మన భారతీయ సనాతన ధర్మం తెలియజేస్తుంది. అంటే పుట్టిన ప్రతి మనిషి ధర్మంగా ఉంటూ ఆస్తి అంతస్తులు సంపాదించి, సంసారం చేసి, పిల్లలను కని, అటు వెనుక మోక్షం పొందాలనే అర్థాన్ని తెలియజేస్తుంది. కాని, దానికి భిన్నంగా, క్రీస్తు జీవిత పరమార్ధం ఇతరులను ప్రేమతో సేవిస్తూ, జాలి, కనికరము, సోదరభావంతో సేవక పాత్ర పోషిస్తూ కార్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను, శ్రమలను భరిస్తూ దైవరాజ్య స్థాపనకై శ్రమిస్తూ జీవితాంతము ఇతరులకై జీవించడమే జీవిత పరమావధి అని తెలియజేస్తున్నారు. మోక్ష రాజ్యాన్ని మనము పొందాలంటే క్రీస్తును అనుసరిస్తూ సేవాభావంతో జీవిస్తూ, ఆయన సిలువలో భాగస్థులను కావాలి. ఆయన పాత్రను నుండి మనము పానము చేయగలమా ఆయన సిలువను మనము మోయగలమా అని ప్రశ్నించుకోవాలి. ఆయన పాత్ర చేదుగా ఉంటుంది కాని మనకన్నా ముందే ఆయన పానంచేసి, మనము కూడా పానము చేయగలమని తెలిపియున్నారు. ఆయన సిలువ బరువుగా ఉంటుంది కానీ మన కన్నా ముందే ఆయన సిలువను మోసి దానిని తేలికగా చేసి ఉన్నాడు. సిలువ ప్రేమకు సేవకు చిహ్నం.
క్రీస్తు జీవితమే మనకు ఆదర్శం. ఆయన సేవింపబడుటకు కాక సేవచేయుటకు తన జీవితమును అర్పించుటకు వచ్చిఉన్నాడు - మార్కు 10:45; మత్త 20:24-28; లూకా 22: 24-27.
శ్రమలు - అంతరార్థం
జీవితం సుఖమయం కావాలని అందరూ ఆశిస్తారు. కాని శ్రమలు బ్రతుకు బండిని కుంగదీయాలని ఎవరు కోరుకోరు. అందరిలో గొప్పగా ఉండాలని, అందరూ చెప్పుకునే విధంగా ఆస్తి అంతస్తులతో, అధికారంతో, ఇతరులను శాసించాలని మనసు అంతరాలలో వ్యామోహం మనుషుల్లో దృఢంగా ఉంటుంది. కానీ బాధను భరిస్తూ ఇతరుల యోగక్షేమాలపై వారి పాపాల పరిహారమై ఒకరు మరణించటం మనం క్రీస్తునందు చూస్తున్నాము. “అతని మరణం పాపపరిహారబలి అయ్యెను...అతనిని చూసి నేను వారి తప్పిదాలను మన్నింతును” (యెషయ 54:10-11). ఈనాటి మొదటి పటనములోని బాధామయ సేవకుడు, క్రీస్తు రక్షకుని సరిగ్గా పోలియున్నాడు. శ్రమలు అనుభవించి తన మరణము ద్వారా క్రీస్తు మానవాళిని పాప బంధవిముక్తులను చేయటం తండ్రి దేవుని చిత్తం. ఈ బలియాగంలో క్రీస్తు సేవ, శ్రమలే బలియాగం లేక జీవిత అర్చన ప్రార్ధనలని, మానవ బలహీనతలను తనే స్వయముగా భరించి శోధనలను గెలిచి మనకై బలియై, ప్రధాన అర్చకుడై, మన రక్షణకు అవసరమైన కృపావరాన్ని మనకు అందించాడు (హెబ్రీ 4:14-16). ప్రేమకోసం, ఇతరులను పాపవిముక్తులను చేయటంకోసం శ్రమలను అనుభవిస్తూ, కావాలంటే చివరకు ప్రేమకోసం మరణించడం క్రీస్తు శ్రమల్లోని పరమార్ధం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN