ఈనాటి సువిశేష సారాంశం,పద్యరూపంలో
శ్రీమతి బి. మేరీ సుశీల
11 Oct 2024
తేగీ.
నాదు పక్షము కానిచో
నాకు శత్రు!
నాతొప్రోగు చేయని
వాడు చెదరగొట్టు!
అనుచు యేసు బోధించగా
వినిన ఒకతె!
జన సమూహము లోనుండి ఘనత కొరకు!
తేగీ
నిన్ను మోసిన గర్భము ధన్య మౌను!
ధన్యమగు పాలనిచ్చిన
స్థనములున్ను!
అనుచుఎలుగెత్తిపలుకగ
వినెను ప్రభువు!
యేసు-- దేవుని వాక్కును
తెల్సి కొనియు;
దానిపాటించువారలు
ధన్యుమిగుల!