మరియతల్లికి వేరే బిడ్డలున్నారు.వారు మనమే
జోసెఫ్ అవినాష్
11 Oct 2024
సామాన్య 27వ శనివారం
సువిశేష ధ్యానం
లూకా 11:27-28
"దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు” అన్న అమూల్యమైన వాక్య సందేశాన్ని ప్రక్కన పెట్టి అసలు సంబంధం సరిగా లేని వాదనను కొందరు ఈ రెండు వచనాలను ఉపయోగించి అసంపూర్ణ అవగాహనను వ్యక్త పరుస్తుంటారు.కాబట్టి బైబిల్ ఆధారంగా ఈ విషయాలను
గమనించుదాం.
1. యెహెజ్కేలు 44:2: ప్రభువు జన్మించిన తర్వాత గర్భద్వారము పూర్తిగా మూసివేయబడినది.
2. యెషయా 7:14 : ఆమె కుమారుని కని అతనికి ఇమ్మమయేలు అని పేరు పెట్టును.ఏకవచనం, బహువచనం కాదు.
3. పరమగీతాలు 4:7 నీవు సంపూర్ణ సౌందర్యవతిని,నీ యందు కళంకముండదు.
4. సిరా. జ్ఞాన గ్రంథము 24:18 మరియ మహా పవిత్రురాలు, దేవుడు ఆమెను మనకు దయచేసెను.
5. సామెతలు 8:22 : అన్నింటిలో నిన్ను మొదటి దానిగా చేసెను, పవిత్రతలో కుడా జన్మపాపము లేకుండ చేసెను.
6. మత్తయి 1:21 : ఆమె ఒక కుమారుని కనును. ఏక వచనం.
7. మత్తయి 1:22,23 : ఇదిగో కన్య గర్భము దరించి ఒక కుమారుని కనును.
8. లూకా 1:31 : ఇదిగో గర్భము ధరించి కుమారుని కనెదవు. కుమారులను, కుమార్తెలను కాదు.
9. లూకా 1:42 : నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడినది, ఫలములు కాదు.
10. లూకా 2:42, 43: బాలయేసుకు 12 సం॥రాల వయస్సు గల తమ్ముళ్ళు, చెళ్ళెళ్ళు ఎక్కడ?
11. లూకా 11:27 : "నిన్ను మోసిన గర్భము...." ఏక వచనం.
12. లూకా 8:19 : వరుసకు సోదరులు, నిజమైన తోబుట్టువులు కాదు. వారి పేర్లు వ్రాయబడలేదు.
13. యోహాను 1:2 : పెళ్ళిలో యేసు తోబుట్టువులెక్కడ ?
14. యోహాను 19:25 : సిలువ చెంత మరియ, కొందరు స్త్రీలు మాత్రమే ఉన్నారు, తోబుట్టువులెక్కడ?
15. యోహాను 20:17,18 : సోదరులు అంటే శిష్యులని అర్థమవుతుంది.
16. దర్శన 12:1 సూర్యుడు ఆమె వస్త్రము.శిరస్సుపై 12 నక్షత్రాలున్నాయి.ఆమె అతిపవిత్రురాలు.