పీఠాధిపతులు శ్రీసభకు వెన్నుముక్క - పోప్
వాటికన్ వార్తా విభాగం
11 Oct 2024
రోమ్ వేదికగా, సినడ్ మలి విడత సమావేశాలు జరుగుతున్న విషయం మనకు తెలిసినదే.నిన్నటి రోజున "శ్రీసభలో పీఠాధిపతుల పాత్ర" అను అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది.ఈ చర్చలో పలువురు పీఠాధిపతులు సినడ్ తమ అభిప్రాయాలను ఇతర పీఠాధిపతులతో పంచుకున్నారు. పోప్ మాట్లాడుతూ! పీఠాధిపతులు పీఠానికి వెన్నుముక్కలాంటివారని పవిత్రాత్మ సర్వేశ్వరుని వెలుగులో పయనిస్తూ,ప్రజలను పాలించాలని వారిని దైవమార్గంలో నడిపించాలని ఆయన కోరారు.ఇతర పీఠాలకు చెందిన పీఠాధిపతులతో స్నేహభావంతో మెలగాలని,ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, శ్రీసభ బలోపేతానికి కృషి చేయాలని ఆయన విశ్వ పీఠాధిపతులను ఆదేశించారు.