నేటి సువిశేష సారాంశం ,పద్యరూపంలో
శ్రీమతి బి. మేరీ సుశీల
09 Oct 2024
తేగీ
పొద్దు పోయిన వేళను మిత్రుడొకడు!
మార్గ మధ్యాన వచ్చెను మా గృహముకు!
అతని ఆకలి తీర్చగా అడుగుచుంటి!
మూడు రొట్టెలు దయచేయ వేడుచుంటి!
తేగీ
అనుచు నొకడు తన మిత్రుని అడిగినపుడు!
కష్టమైనను బ్రతిమాలు నట్టి యడను!
విసుగు చెందక యివ్వడే
విజ్ఞు డపుడు!
నీవు గోజాడ దేవుని నీకు నట్లె!
తేగీ
అడుగుడీయివ్వబడు మీకు ఆశయున్న!
తట్టుడీ తెర్వబడు మీకు తపన యున్న!
వెతకుడీ దొరుకును మీకు వివరమున్న!
పరమ తండ్రికి ప్రార్ధనే ప్రాణసమము!