పవిత్రాత్మ శ్రీసభను విస్తరిస్తుంది- పోప్
వాటికన్ వార్తా విభాగం
09 Oct 2024
దేవుని సత్యసువార్తను నలుదశలా విస్తరింపచేయడానికి పవిత్రాత్మ ఎంతగానో తోడ్పడుతుందని కొద్దిసేపటి క్రితం జరిగిన జనరల్ ఆడియన్స్ లో పోప్ అన్నారు.గత కొన్ని నెలలుగా "శ్రీసభలో పవిత్రాత్మ ప్రభావం" అను అంశంపై ప్రసంగిస్తున్న పోప్ ఈసారి కూడా ఇదే అంశంపై తన సందేశాన్ని కొనసాగించారు.పవిత్రాత్మ శ్రీసభ పరిధిని విస్తరింప చేసే సామర్థ్యం కలిగి ఉందని,అదేవిధంగా విశ్వాసుల, శ్రీసభ మధ్య ఐక్యతను పెంపొందించడానికి పవిత్రాత్మ ఎల్లవేళలా తోడ్పడుతుందని ఆయన అన్నారు.పవిత్రాత్మ రాకడను గూర్చి తెలియపరుస్తూ,శిష్యులు పవిత్రాత్మతో నింపబడిన తర్వాత వివిధ భాషల్లో మాట్లాడారని, ఏసుక్రీస్తును ప్రకటించారని ఆయన అన్నారు.పవిత్రాత్మ వెలుగులో పయనిస్తూ, సువార్తికరణ చురుగ్గా నిర్వహిస్తూ, శ్రీసభ అభివృద్ధికై తోడ్పాటును అందించాలని ఆయన కతోలిక సమాజాన్ని కోరారు.