నేటి సువిశేష సారాంశం,పద్యరూపంలో
శ్రీమతి బి. మేరీ సుశీల
16 Sep 2024
తేగీ
యేసు నాయీను గ్రామాన
శిష్యతతితొ;
నడుచు చుండ గవినికడ
పాడెయొటి!
యెదురుపడె నది విధవరాలేకపుత్రు;
మరణమైమరుభూమికి చేర్చుగుంపు
తేగీ.
అలమ టించెడివారిపై
జాలినొంది;
పాడెముట్టగ నిలచిరి
భారమతులు!
తల్లినోదార్చి బంధుల పలకరించి;
"చిన్నవాడలెమ్మని" యేసు
చెప్పినంత;
లేచికూర్చుండి మాట్లాడె
నచ్చెరువుగ!
తేగీ.
భయము నభయము కలిగెను ప్రజలకపుడు!
దీర్ఘ దర్శిమనలొ కొల్వు
దీరెననుచు!
మహిమ పరచిరి దేవుని
మహిత శక్తి!
వార్త యూదయా ప్రాంతాన విస్తరిల్లె!