క్రీస్తుని పోలి జీవించాలి
జోసెఫ్ అవినాష్
16 Sep 2024
సామాన్య 24వ మంగళవారం
సువిశేష ధ్యానం
లూకా 7:11-17
నేటి సువిశేషము లో నాయిను గ్రామములో ఒక విధవరాలి ఏకైక కుమారుని సమాధి చేయడానికి తీసుకువెళుతున్నప్పుడు దుఃఖిస్తున్న వితంతువుకు యేసుప్రభువు ఎదురుపడిన వృత్తాంతాన్ని వివరిస్తుంది.ఆ సమయములో యేసుతో పాటు అనుసరించి వచ్చిన జనసమూహం అక్కడ ఉంది. అలాగే ఆ స్త్రీతో పాటు నడుస్తున్న ప్రజలు ఉన్నారు. యేసు ఆమె వాస్తవికతను చూసారు.ఆమె ఒంటరిగా ఉంది.ఆమె ఒక వితంతువు. ఆమె తన ఏకైక బిడ్డను కోల్పోయింది.యేసుప్రభువు కరుణతో కదలిపోయారు, ఎందుకంటే ఆయన కరుణామయుడు.కరుణ గుణం ఇతరుల వాస్తవికతను లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది.కరుణ,కనికరం అనేవి మన హృదయ కటకాలు లాంటివి.ఇవి మనలను వాస్తవిక కోణాలను గ్రహించేలా చేస్తాయి.సువార్త పఠనాలలో యేసు తరచుగా కనికరంతో కదిలించబడ్డారు అని మనము చదువుతుంటాము.ఎందుకంటే కరుణ,దేవుని భాష,మన దేవుడు దయగల దేవుడు.ఆ దయ, కనికరమే తన కుమారుడిని మన మధ్యకు పంపేలా ప్రేరేపించింది.కనికరం అనేది జాలి కాదు.కనికరం అనే ఇతరుల సమస్యలలో పాలుపంచుకోవడం.కరుణ మనల్ని నిజమైన న్యాయం వైపు తీసుకెళ్తుంది.ప్రతి ఒక్కరి పట్ల కూడా కరుణ కలిగి ఉండేలాగున ఆ ప్రభుని కృపకై ప్రార్థించుదాం.
మనం కూడా పేదలయెడల, వితంతువుల ఎడల జాలి, కరుణ కలిగియుండాలి. సాధ్యమైతే వారికి సహయం చేయాలి,చేయతనివ్వాలి. యేసు వలే మనం ఇతరులకు, వితంతువులకు చేయూతనివ్వాలి.