దైవజ్ఞానం జీవితాన్ని నూత్నికరిస్తుంది- పోప్
వాటికన్ వార్తలు
16 Sep 2024
ప్రభువును తెలుసుకున్నప్పుడు జీవితం సరికొత్తగా మారుతుందని ,మనకు ప్రభువును గూర్చిన జ్ఞానం ముఖ్యమని అయితే ప్రభువును, ఆయన సువార్తను అనుసరించడం ద్వారా మనల్ని మనం సరికొత్తగా మార్చుకోవచ్చని నిన్న వాటికన్ వేదికగా తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.మనం ఇంకా ప్రభువును గురించిన దానికంటే ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఇలా తెలుసుకోవడం ద్వారా మన హృదయాలు, జీవితాలు రూపాంతరం చెందుతాయని పోప్ పేర్కొన్నారు.