నేటి సువిశేష సారాంశం పద్య రూపంలో

శ్రీమతి బి. మేరీ సుశీల

15 Sep 2024

తేగీ
ప్రజలకు సువార్త వినిపించి
ప్రభువు వచ్చె!
బాల్యమందు దిరిగిన
కపెపర్నహోము!
దాసుడొకడుండె ప్రియుడై
శతాధిపతికి!
జబ్బుపడియున్నదాసుపై
జాలినొంది ;
స్వస్తు చేయగదాసుని
యేసు కడకు!
మదినివిశ్వాసముతొబంపె
యూదజనుల!

తేగీ.
యూదులవినతి శతపతి పెద్దమనసు;
తెలిసి దిగివెళ్శెనధికారి
తెరవుదరికి!
ప్రభుని దూరాన గమనించి పరిజనమును;
పంపెమరియొకవిజ్జాపనంబుచేయ!
తేగ
నాగృహమునప్రవేశింప
పాత్రుకాను!
ఒక్క మాటతొరోగము
చక్క బడును!
కోరుదునుమాట సెలవీయ
గురువరేణ్య!
నేనునూఒక పదవిలో
మనుచు నుంటి;
సర్వశక్తుడనీవు సంసారినేను!
పలుకులాలించి యేసయ్య
పలికె నిటుల!
యింత విశ్వాసమిశ్రయేల్ చెంతగలదె?
పరిజనంబులుయింటికి
తిరిగివచ్చి;
స్వస్తుడైయున్న దాసుని చూచిరపుడు !

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN