సిలువేగా మన రక్ష!
కొండవీటి అంతయ్య,సత్తెనపల్లి
14 Sep 2024
సిలువేగా మన రక్ష!
****************
యేసుప్రభువు ఎక్కినట్టి
నాటి సిలువ పండుగ
జరుగుతున్నదీ నాడు
లోకమంత నిండుగా!
సిలువ విలువ తెలుసుకో
కనుల ముందు నిలుపుకో
మనసు నందు తలచుకో
సిలువ గుర్తు వేసుకో!
అను నిత్యము లోకమందు
సైతానుల పార ద్రోలు
చైతన్యము మన కిచ్చెడి
సిలువే గద మనకు రక్ష!