ఈనాటి సువిశేష సారాoశం ,పద్య రూపంలో

శ్రీమతి బి. మేరీ సుశీల

13 Sep 2024

తేగీ
పరమునుండి దిగిన వాడె
పరముకెక్క!
శక్తిగలవాడు తా
మనుషకొమరు డగు!
సర్పమును మోషె అడవిలొ
జూపినట్లు;
మనుష కొమరుడు పైకెత్త
బడగ వలయు!

తేగ
పాపభారము పోద్రోల
పరమునుండి;
తనసుతుని పంపె
భువి పైకి నెనరుతోడ!
నమ్ముప్రతి వాడు రక్షణ
నందుకొనగ!
దేవుడెంతగా ప్రేమించె
నీవసుధను

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN