సిలువ విజయోత్సవ పర్వదినం సందర్భంగా
డా. కల్లూరి ఆనందరావు
13 Sep 2024
త్యాగధనుని తనువు తనివితీర తడిమి
సిలువ శిరసునెత్తి విజితననియె!
యేసు ప్రభుని బాట యేమరక నడచి
విజయమొందితి మని సుజనులనగ!
సిలువ మార్గమందు అలుపెరుగక సాగు
భక్త జనులకెల్ల పర్వ దినము!
సిలువ మోసినట్టి శ్రీ యేసు సైన్యమై
విజయ గీతి పాడ వెడలి రండు!