దైవాంకితులు ప్రజలకు చేరువలో ఉండాలి- పోప్
వాటికన్ వార్తలు
13 Sep 2024
జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్, తన 45వ అపోస్తలిక యాత్రలో భాగంగా ఆసియాలో 12 రోజులు పాటు పర్యటిస్తున్న విషయం మనకు తెలిసినదే. పోప్ ఈ పర్యటనను ఈరోజు సింగపూర్లో ముగించారు.ఈ ఆఖరి రోజు సింగపూర్ మత పెద్దలతో, దైవాంకితులతో సమావేశమై వారితో ముచ్చటించారు. దైవాంకితులు పవిత్రతలో ఎదుగుతూ, ప్రజలకు చేరువలో ఉండాలని ఆయన కోరారు.ముఖ్యంగా స్థానిక పీఠాధిపతుల ఆజ్ఞలను గౌరవిస్తూ ,ఒకరినొకరు గౌరవించుకుంటూ శ్రీసభ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతిరోజు దేవునితో కొంత సమయాన్ని కేటాయిస్తూ ,విచారణ ప్రజలను సన్మార్గంలో నడిపించాలని దైవాంకితులుగా అది మన బాధ్యతని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.