నేటి సువిశేష సందేశం ,పద్య రూపంలో
శ్రీమతి .మేరీ సుశీలా దేవి
01 Aug 2024
తేగీ.
యితడు మరియమ్మ యేసేపు సుతుడు కాడె!
యింత జ్ఞానము ఏవిధి
సంతరించె!
స్వజను లీవిధి యనుచును
సణుగుకొనిరి!
తే.గీ.
(0యేసు)
"బంధు జనమును స్వదేశ
ప్రజలుతప్ప;
దార్శనీకుని ప్రతిచోట గౌర వింత్రు!"
వ్యాధి బాధితులందరి
బాధ మనిషి;
అద్భుతంబులుచేయక
అణగియుండె!