వత్తాసు బాల,బాలికల సేవలు మరువలేనివి- పోప్
వాటికన్ వార్త విభాగం
01 Aug 2024
దివ్యబలిపూజలో గురువుకు సాయం చేసే వత్తాసు బాల,బాలికల సేవలు మరువలేనివని జగద్గురువులు పోప్ అన్నారు.రోమ్ వేదికగా వత్తాసు బాల ,బాలికల సదస్సులు జులై 29 ఆరంభమై ఆగస్టు 3 తో ముగియనున్నాయి. జగద్గురువులు పోప్ ఈ సదస్సులో పాల్గొని పై వ్యాఖ్యలు చేశారు.ఇద్దరు లేదా ముగ్గురు నా పేరిట సమావేశమైనప్పుడు,నేను వారి మధ్య ఉంటానని ప్రభువు వాగ్దానం చేశారని, బలిపీఠ సన్నిధిలో పూజలో గురువుకు సాయం చేయడం ఎంతో ప్రీతికరమైన విషయమని ఆయన అన్నారు.పూజలో గురువుల ప్రార్థన ద్వారా గోధుమ అప్పం నిజ క్రీస్తు శరీరంగా మారుతున్నదని అట్టి గురువుకు సాయం చేయటం నిజంగా గొప్ప విషయమని వత్తాసు బాలబాలికలను ఆయన అభినందించారు.తల్లిదండ్రులు బిడ్డలను వత్తాసుకు పంపాలని, గురువులు వారిని ప్రోత్సాహించాలని ఆయన కోరారు.