ఆగస్టు మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
వాటికన్ వార్త విభాగం
31 Jul 2024
జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్, ఆగస్టు మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించారు. రాజకీయ నాయకులు సుపరిపాలనే లక్ష్యంగా పరిపాలించే లాగున కృషి చేయాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ఆయన కోరారు. రాజకీయ నాయకులు పేదల పక్షాన నిలబడాలని, సమగ్ర మానవాభివృధే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు. దేవుని కుమారుడైన క్రీస్తుప్రభువు ఒక సాధారణ మానవుడిగా పుట్టి, సేవకునిగా మారిన సందర్భాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తూ ప్రజలను పాలించాలని ఆయన ఆదేశించారు.