నేటి సువిశేష సారాంశం పద్య రూపంలో
శ్రీమతి .మేరీ సుశీలా దేవి
30 Jul 2024
తేదీ 31-07-2024తేగీ.
దైవ రాజ్యము పొలమున
దాచబడిన;
ధనమువలెనొప్పు చూడగా
ధాత్రి యందు!
ధనము కనుగొని వొక్కడు
దానికొరకు;
కలిగినదంతావెచ్చించి
పొలము కొనును!
తే.గీ
దైవ రాజ్యముముత్యమున్ దలపజేయు!
వర్తకుడొకడు ముత్యము
కొరకు గాను;
వున్నదంతయు అమ్మియు దాన్ని కొనును!
ఆణిముత్యము విలువైంది
అన్ని మించి;
దైవ రాజ్యము మించింది
భువిన లేదు!