ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి - పోప్
వాటికన్ వార్త విభాగం
29 Jul 2024
నడిపూజ సమయంలో గురువు ఏ విధంగా అయితే క్రీస్తు శరీర,రక్తాలను పూజలో పాల్గొన్న ప్రతి విశ్వాసికి సమర్పిస్తాడో, ప్రతి విశ్వాసి కూడా తన జీవితాన్ని ఇతరులకు మంచి చేయడానికి వినియోగించాలని పోప్ అన్నారు. అర్పిత హృదయం, కృతజ్ఞతా భావం ఈ రెండు లక్షణాలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని నిన్న వాటికన్ వేదికగా తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. సువిశేషంలో బాలుడి వలె మనం కూడా మన దగ్గర ఉన్నది అవసరతలో ఉన్న వారితో పంచుకుంటే దేవుడు మన జీవితాల్లో మనం సమర్పించిన దానికన్నా మరింత ఎక్కువగా సమకూరుస్తాడని ప్రతి విశ్వాసి ఇచ్చే గుణాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు.