వృద్ధులను విడిచిపెట్టవద్దు- పోప్
వాటికన్ వార్త విభాగం
29 Jul 2024
జులై 28, 4వ అంతర్జాతీయ అవ్వ ,తాతల దినోత్సవం పురస్కరించుకొని పోప్ తన సందేశాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ!
వృద్ధాప్యంలో "నన్ను విడిచిపెట్టవద్దు!" అన్న వృద్ధుల మనోవేదనను ఆలకిస్తూ, "నేను వృద్ధాప్యంలో మిమ్మల్ని విడిచిపెట్టను అని ప్రతి ఒక్కరు వృద్ధులకు భరోసా కల్పించాలని ఆయన అన్నారు.చాలా మంది వృద్ధులకు, "ఒంటరితనం భరించడం కష్టమైన భారంగా మారే ప్రమాదం" ఉందని వారి కష్ట సమయాలలో వారికి తోడుగా ఉండాలని. ముఖ్యంగా యువత అవ్వ ,తాతలను గౌరవిస్తూ వారి అనుభవాలను పరిగణలోకి తీసుకుని ముందుకు కదలాలని , "తాతలు మరియు మనవళ్ల మధ్య, యువకులు మరియు వృద్ధుల మధ్య మైత్రిని బలోపేతం చేయడానికి" విశ్వాసులందరూ కృషి చేయాలని పోప్ కోరారు. ఈ దినోత్సవం లో పాల్గొన్న వృద్ధులందరికీ వారు సమాజానికి, శ్రీ సభకు చేసిన సేవలకు గాను ఆయన చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియపరిచారు.