సువిశేష పఠన సారాంశము.
శ్రీమతి .మేరీ సుశీలా దేవి
15 Jun 2024
సామాన్య. 11వ ఆదివారం
16/06/2024.
సువిశేష పఠన సారాంశము.
(మార్కు 4:26- 34)
తే॥గీ॥
విత్తనములు వెదజల్లు విత్తువాడు,
తనకు తెలియని విధమున కనగ పెరుగు!
మొలకలెత్తును పైరగు ఫలమునిచ్చు!
దైవ వాక్యము విత్తగా, ధరణిలోన!
విజ్ఞుల హృదిన ఫలియించు విస్తృ తముగ!
తే॥గీ॥
దైవరాజ్యము తలపించు ఆవగింజ,
విత్తనములందు చిన్నదే ఎత్తి చూడ!
పెరిగి పెద్దదై కొమ్మల తరువు యగును!
పక్షులు వసించు గూళ్ళలో పదిలముగను !
దైవవాక్యము వ్యాపించు దశ దిశలును!