అయోమయంలో ఉన్నప్పటికీ ప్రభువుతో సంభాషణను కొనసాగించాలి - పోప్

జోసెఫ్ అవినాష్

31 Aug 2026

ఆగస్టు 30, 2026న కాస్టెల్ గాండోల్ఫోలో నిర్వహించిన ఏంజెలస్ ప్రార్థన సందర్భంగా పోప్ లియో XIV, సువిశేషములోని పునీత పేతురు సంఘటనను వివరిస్తూ విశ్వాసులకు ముఖ్యమైన సందేశాన్ని అందించారు.యేసు తన శ్రమలు,మరణం,పునరుత్థానం గురించి శిష్యులకు తెలియజేసినప్పుడు,పేతురు దానిని అర్థం చేసుకోలేక యేసును వ్యతిరేకించాడు.ఇదే విధంగా మన జీవితాల్లో కూడా దేవుని మార్గాలు మన అంచనాలకు భిన్నంగా ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవడం,అంగీకరించడం కష్టమవుతుందని పోప్ అన్నారు.అలాంటి సందర్భాల్లో దేవుడు మన మాట వినడం లేదని లేదా మనపై శ్రద్ధ చూపడం లేదని భావించే ప్రలోభం కలుగుతుందని ఆయన గుర్తుచేశారు.అయితే పేతురు మనకు రెండు ముఖ్యమైన పాఠాలను నేర్పుతున్నాడని పోప్ చెప్పారు: మొదటిది—ఎంత అయోమయంలో ఉన్నప్పటికీ ప్రభువుతో మన సంభాషణను ఎన్నడూ ఆపకూడదు; రెండవది—దేవుని కార్యాలను మన అంచనాలకు సరిపోలలేదని తీర్పు చేయకుండా,ప్రార్థనతో మరియు వినయంతో ఆయన మనకు తెలియజేస్తున్నదాన్ని స్వీకరించాలి.యేసును విమోచకుడిగా గుర్తించిన పేతురు, చివరకు క్రీస్తు మాటలకు జీవితాంతం విశ్వాసంగా నిలిచి, హతసాక్షిగా మరణించాడని పోప్ వివరించారు. మన ప్రార్థనలో కూడా పేతురులా మన హృదయంలోని నిజమైన భావాలను యేసుతో వినయంగా పంచుకోవాలని,అదే సమయంలో మన అంచనాలకు మించినప్పటికీ ప్రభువు కోరేదాన్ని స్వీకించే విధేయతను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.సిలువ పాదాల వద్ద కూడా దేవుని ప్రణాళికకు విధేయురాలైన కన్య మరియను మనకు ఆదర్శంగా చూపిస్తూ,ఆమె సహాయం కోసం ప్రార్థించాలని పోప్ కోరారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN