వాగు కన్న కొలను తూగు మేలు!.

డా. కల్లూరి ఆనందరావు
24 May 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...................................................................
వినయమున్న పలుకు వినినంత హృద్యమ్ము!
గొప్ప ఖ్యాతి తెచ్చు గుణము సుమ్ము!
కొండవాలు నుండి గుండెలదర పాఱు
వాగు కన్న కొలను తూగు మేలు!.
