శ్రీసభ మాత పండుగ

జోసెఫ్ అవినాష్

24 May 2026

ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది. అవును భౌతిక జీవన క్రమంలో వారికి జన్మనిచ్చిన తల్లి .కానీ క్రైస్తవులకు విశ్వాసం గల తల్లి ఉన్నారనుటలో సందేహం లేదు. ఆధ్యాత్మిక పయనంలో శ్రీసభమాతగా అలరారుతూ ప్రతి క్రైస్తవుని నడిపిస్తున్న తల్లి మరియమాత. యేసుప్రభువు తొలి క్రైస్తవులకే కాక మలి క్రైస్తవులకు తల్లిగా నియమించారు.మనందరి తల్లిగా ఉండాలని ఎంతో కోరుకున్నారు ఆయన సిలువ నుండి తల్లి వైపు చూస్తూ స్త్రీ ఇదిగో నీ కుమారుడు (యోహాను 19:26) అన్నారు మరియు ప్రియమైన శిష్యుడికి ఇదిగో నీ తల్లి(యోహాను 19:27) శతాబ్దాలుగా క్రైస్తవులు మరియమాతను తమ తల్లిగా పిలిచారు. మరియు గౌరవించారు. పునీత జాన్ పాల్ పాపుగారు మరియమాతను వ్యక్తిగతమైన తల్లిగా తీసుకోవాలని ఆధ్యాత్మిక తల్లిగా మన జీవితంలోకి ఆహ్వానించాలని కోరారు. ముఖ్యంగా దుఃఖ సమయంలో తల్లిగా ఉండాలని కోరారు. తల్లి యొక్క మాతృత్వాన్ని నొక్కి చెప్పారు.6వ పాల్ పోపుగారు మరియతల్లి శ్రీసభ యొక్క తల్లిగా ప్రకటించారు. 2018లో స్వర్గీయ. పోప్ ఫ్రాన్సిస్ గారు పెంతుకోస్తు తరవాత సోమవారాన్ని శ్రీసభ తల్లి అయిన కన్య మరియమాత బైబిల్ మరియు తొలి క్రైస్తవ సాంప్రదాయం ద్వారా మరియమాతను శ్రీసభ తల్లి అని స్పష్టంగా తెలిపారు. యేసుప్రభువు బోధిస్తున్న ఇంటికి యేసు తల్లి మరియు అతని సోదరులు మరియు సోదరీమణులు చేరుకున్నప్పుడు సంగ్రహ సువార్తలు యేసు పరిచర్యలో ఒక వృత్తాంతాన్ని అందిస్తాయి(మత్తయి 12:40-50,మార్కు 3:31-35,లూకా 8:19-21) తన తల్లి బయట ఉన్నట్లు ప్రభువుకు తెలియగానే నా తల్లి మరియమాత, నా సోదరులు దేవుని వాక్కును విని దాని ప్రకారం నడుచుకునేవారు అని తల్లి గురించి ప్రశంసించటం మనం ధ్యానిస్తాం.మరియతల్లి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని యేసు చెప్పిన మాటలను మనం క్షుణ్ణంగా ధ్యానిస్తే, ఈ బోధను అనుసరించిన యేసు శిష్యులలో మరియతల్లి మొదటి వ్యక్తి అనుటలో ఆనందించాల్సిన విషయం. గాబ్రియేలు దేవదూత సందర్శన ద్వారా ఆమె దేవుని వాక్యాన్ని విన్నారు. ఆమె వెంటనే తన జీవితంలో ఆచరణలో పెట్టారు.. ఆమె తన జీవితాంతం దేవుని చిత్తానికి పూర్తి విధేయతతో జీవించింది తన కుమారుని బోధలు భౌతికం కంటే ఆధ్యాత్మికతను ఉన్నతంగా జీవించాలని తన దర్శనాల ద్వారా ప్రతి ఒక్క క్రైస్తవుడిని విశ్వాసులని అర్థిస్తున్నారటలో విశేషంగా చెప్పగలం

తిరు కుటుంబం ప్రేమైక్య కుటుంబంగా కొనసాగుతుంది అంటే మరియమాత తల్లిగా పోషించిన పాత్ర గణనీయం. తిరుకుటుంబం పరలోక రాజ్యంలో ఎప్పటికీ కలిసి ఉంటుంది. తిరుకుటుంబమే శ్రీ సభ ఏర్పాటుకు తొలి పునాది రాయిగా అగుపిస్తుంది. మరియమాత తిరుకుటుంబ సభ్యురాలు కుటుంబ అవసరాలు, బాధ్యతలు అక్కరలు, వ్యాధి బాధలు, కష్టసుఖాలు, సంతోషాలు ఆమెకు వెన్నతో పెట్టిన విద్య ఈనాడు శ్రీసభ తల్లిగా అలరారుతూ మన వేదలలో చేయూతనిస్తారు అనుటలో సంశయం ఉండరాదు.

యేసుప్రభు మోక్షరోహణం తర్వాత మొదటి రోజులలో అపోస్తులను వెన్నంటి, వారిని ఓదారుస్తూ ప్రార్థనా బలంతో వారిని ప్రభువు కొరకు జీవించినట్లు తోడ్పడ్డారు మరియమాతతో కలిసి అపోస్తులులు పవిత్రాత్మ రాకకు ప్రార్థించి దేవుని శక్తిని పొందుకున్నారు. దేవునికై జీవించారు. శ్రీసభ ఏర్పాటుకు మరియతల్లి పాత్ర ఎంతగానో ఉంది అని మనం విశ్వసించాలి."ఫుల్ ఆఫ్ గ్రేస్" తెలుగులో "దయగల తల్లి" సినిమాలో ఒక సీన్ చూసినప్పుడల్లా మనసు ఎంతగానో కదిలించబడుతుంది. భూమిపై మరియ తల్లి చివరి రోజులు దగ్గర పడుతూ ఉండగా శిష్యులు వేద ప్రచారం నుండి తిరిగివచ్చి తల్లితో సుఖదుఃఖాలను పంచుకోవడం మరియను ప్రేమతో "అమ్మా" అని పిలుస్తుండటం నాకు ఎంతగానో నచ్చిన సన్నివేశం శిష్యులు మరియతల్లితో సహా మరియ ప్రార్థనలను కోరుతున్నట్లు కూడా ఈ చిత్రం ప్రత్యేకత. ఇది ఊహించుకోవటానికి సినిమా సన్నివేశమైనప్పటికీ ఇవి నిజ సత్యాలు అపోస్తులలు పని ఆమె కుమారుని పని యొక్క పొడిగింపు


ఆమె వారిని తల్లి హృదయంతో ప్రేమిస్తుందని అనుకోవటం సహజం. వారు చెప్పింది వినటం మరియు ప్రభు శిష్యుల కోసం ప్రార్థించుకొనుటలో నమ్మదగిన సత్యం

దైనందిన అద్భుత దర్శనాలలో మరియమాత తను తాను శ్రీసభ మాతగా చూపిస్తూనే ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు మరియు క్రైస్తవేతరులు తమ అవసరాలలో ఆమెను "అమ్మా" అని నోరార పిలుస్తూనే ఉన్నారు ఆదిఖ్యమైన వరములు పొందుతూనే ఉన్నారు. దీనికి నిదర్శనం మరియతల్లి పుణ్యక్షేత్రాల ద్వారా సర్వ మానవ లోకాన్ని ప్రభువు చెంతకు నడిపిస్తున్నారు అనే విషయాలు మనలను ఎంతో అబ్బుర పరుస్తుంటాయి. అనేకమంది ఆ తల్లి యొక్క మొక్క చిత్రాలను స్వరూపాలను కొనుగోలు చేసి "అమ్మ మరియతల్లి మమ్ము దీవించు" అని గుండెలకు హత్తుకొని ముద్దాడుటలో ప్రశాంతతను పొందుతారు. ఆమె ప్రేమను అనుభవిస్తూ ఉంటారు. మరియతల్లి మధ్యవర్తిత్వము ద్వారా చాలామంది ప్రజలు ప్రార్థించి సమాధానం పొందుతూ ఉన్నారు. ఒక తల్లిగా శ్రీ సభ గురించి మరియు ప్రతి ఒక్క సభ్యుని పట్ల కూడా శ్రద్ధ వహిస్తుంది. మరియతల్లి ఎనలేని భక్తి విశ్వాసాల ద్వారా ఆమె విశ్వాసులందరినీ ప్రభువు వైపు నడిపిస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలో నేర్చుకుంటాను ముందుగా మరియమాతను మన తల్లిగా అంగీకరించాలి, పునీత యోహాను గారి వలె మరియతల్లిని మన ఇంటిలోనికి అనుదినం ప్రేమతో ఆహ్వానించాలి. ఆమెను మన తల్లిగా ఉండమని ఆమెలో దాగి ఉన్న మాతృత్వానికై ప్రార్థించాలి. వేడుకోవాలి అనుదినం జపమాల ద్వారా స్మరించాలి ఆమెతో మన తల్లిలా మాట్లాడాలి ఎందుకంటే ఆమె మనందరికీ స్వయాన ఏసుప్రభువు ఒసగిన తల్లి ఆమె మన తల్లి మనం ఆ తల్లి బిడ్డలం శ్రీ సభ బిడ్డలందరికీ ఆమె తల్లి

మరియతల్లి ఒకసారి క్రీస్తు తల్లి దేవుని కుమారుడు మరియు శ్రీ సభ అయినా ఆయన ఆధ్యాత్మిక శరీర సభ్యులకు తల్లి అని సూచిస్తుంది. నిజానికి సిలువ క్రింద నిలబడి ఉన్న తల్లి(యోహాను 19:25) తన కుమారుని ప్రేమ యొక్క నిబంధనను అంగీకరించింది.
ప్రియమైన శిష్యుని వ్యక్తిత్వంలోని ప్రజలందరినీ కుమారులు మరియు కుమార్తెలుగా శాశ్వతమైన జీవితానికి పునర్జన్మ పొందేందుకు స్వాగతించింది. ఆ విధంగా ఆమె శ్రీసభ యొక్క మృదువైన తల్లి అయింది. పెంతుకోస్తు తర్వాత సోమవారం మరియమాత స్మారక పండుగ మదర్ ఎక్లిసియా పోప్ ఫ్రాన్సిస్ మరియు జోస్మారియా నుండి కొన్ని గ్రంథాలు ప్రార్థన నియమావళి ఈ పండుగ రోజు మనకు సహాయ పడగలవు. ప్రజల విముక్తి కోసం హృదయపూర్వకంగా ఎదురుచూస్తున్న ఒక యూదా మహిళ మరియతల్లి క్రీస్తు ప్రభువుతో ఐక్యతకు గుర్తుగా ఉంది. తల్లి బోధించేది ఏమనగా ఎల్లప్పుడూ యేసులో ఐక్యంగా ఉండాలి శ్రీసభ ఎదుగుదలకు మన విశ్వాసాన్ని మన ప్రవర్తన నియమాలను మన ప్రార్థనలను మన సోదర భావాన్ని కనపరచాలి. మరియతల్లి యొక్క ఆధ్యాత్మిక మాతృత్వం వేనోళ్ల కొనియాడ దిగినది కన్య మరియమాత రెండవ అవ్వమ్మ దేవుని తల్లి ఎప్పుడు కన్య నిష్కలంక మరియ స్వర్గరోహిత మాత సుగుణాల సుందరి మూర్తి శ్రీసభ తల్లి కచ్చితంగా ఇప్పటి మరెప్పటికీ తరతరాలు ఆమె ధన్యురాలు అని కొనియాడుతూ ఉంటారు(లూకా 1:48)

క్రీస్తు మరియమాత ఆత్మ రహస్యంలో కన్య మరియమాత పాత్ర పరిగణించబడుతున్నందున కన్య మరియమాత నిజంగా దేవుని తల్లి మరియు విమోచకురాలిగా గుర్తించబడింది. మరియు గౌరవించబడింది. ఆమె స్పష్టంగా యేసుక్రీస్తు సభ్యుల తల్లి చర్చిలోని విశ్వాసులు పుట్టుక గురించి ఆమె శ్రీ సభకు అధిపతిగా ఉన్నారు. మరియమాత క్రీస్తు తల్లి, శ్రీ సభ తల్లి. ఆమె పాత్ర క్రీస్తుతో ఆమె ఐక్యత నుండి విడదీయరానిది

తండ్రి చిత్తానికి అతని కుమారుని విమోచన కార్యానికి మరియు పవిత్ర ఆత్మ యొక్క ప్రతి ప్రేరణకు ఆమె పూర్తిగా కట్టుబడి ఉండటం ద్వారా కన్య మరియమాత విశ్వాసం మరియు దాతృత్వానికి శ్రీ సభ యొక్క సంకేతం అందువల్ల ఆమె శ్రీ సభలో ప్రముఖ మరియు పూర్తిగా ప్రత్యేకమైన సభ్యురాలు నిజానికి ఆమె శ్రీ సభ యొక్క అనుకూలమైన సాక్షాత్కారం. ఆ తల్లి దీవెనలు పొంది శ్రీసభ మాతగా కొనియాడుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN