పెంతెకొస్తు పండుగ సందర్భంగా

సిస్టర్ A. రాజకుమారి (CSA)

24 May 2026

ఒక పవనం…
అదో జ్వాల…
అదే ఒక నూతన ఆరంభం

కొన్ని పవనాలు మెల్లిగా
వీచి మనసుకు హాయిని ఇస్తాయి.
మరికొన్ని పవనాలు
తుఫానులా వచ్చి
జీవితాన్నే మార్చేస్తాయి.
పెంతెకొస్తు రోజున కూడా
అలాంటి పవనమే వీచింది.
అది సాధారణ పవనం కాదు…
దేవుని పరిశుద్ధాత్మ శ్వాస.
ఆ పవనం వీచిన వెంటనే
అగ్నిజ్వాలల రూపంలో
పరిశుద్ధాత్మ శిష్యులపై దిగివచ్చాడు.
ఆ జ్వాల వెలుగు మాత్రమే కాదు…
భయాన్ని తొలగించిన ధైర్యం,
సందేహాన్ని పారద్రోలిన విశ్వాసం,
ప్రేమను పంచే దైవశక్తి.

భయంతో తలుపులు
మూసుకుని కూర్చున్న
శిష్యులు ఒక్కసారిగా ధైర్యవంతులయ్యారు.
మాట్లాడడానికి భయపడిన
వారు వేలమందికి దేవుని
ప్రేమను ప్రకటించారు.
గాలి వీచింది…
జ్వాల వెలిగింది…
జీవితాలు మారిపోయాయి.
అదే పెంతెకొస్తు మహిమ.

ఈ రోజూ మన జీవితాల్లో
కూడా అలాంటి
మూసివేసిన తలుపులు ఉంటాయి.
కొన్ని బాధ మూసేస్తుంది.
కొన్ని నిరాశ మూసేస్తుంది.
కొన్ని భయం మూసేస్తుంది.
కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు
ఆ తలుపులు తెరుచుకుంటాయి.

ఆయన పవిత్ర పవనం
మనలోని అలసటను తొలగిస్తుంది.
ఆయన జ్వాల మన
హృదయాల్లో ఆశను వెలిగిస్తుంది.

పెంతెకొస్తు మనకు గుర్తు చేస్తుంది
మనలో దేవుడు ఉంచిన
వెలుగు ఇంకా ఆరిపోలేదు.

మన మాటల్లో ప్రేమ ఉండాలి.
మన చేతల్లో సేవ ఉండాలి.
మన హృదయంలో క్షమ ఉండాలి.
అప్పుడే మన జీవితమే
ఒక పెంతెకొస్తు అవుతుంది.

ఈ పండుగ మనకు ఒక పిలుపునిస్తోంది:
“దేవుని ఆత్మతో నిండిపో…
ప్రేమను పంచు…
ఆశను వెలిగించు…
ప్రపంచానికి వెలుగుగా జీవించు.”

పరిశుద్ధాత్మా రమ్ము…
నీ పవిత్ర పవనంతో మమ్మల్ని తాకి,
నీ దివ్య జ్వాలతో మా
హృదయాలను వెలిగించుము.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN