నేటి పునీతుడు: పునీత పీటర్ దమియెన్

ఫాదర్ ఆకుల ప్రసాద్
20 Feb 2026
సుగుణం: "శ్రీసభ పండితుడు, సంస్కర్త”
శ్రీసభ పండితుడు,కార్డినల్ యైన పీటర్ ఒనెస్తి గారు క్రీ.శ.1006లో ఇటలీలోని రావెన్నానందు జన్మించారు.చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి తన పెద్దన్న దగ్గర పందులు మేపే జీతగానిగా పనిచేశారు.పీటర్ గారి మరోసోదరుడైన దమియెన్ గారు రానేన్నాలో విచారణగురువుగా పనిచేసేవారు.అతను పీటర్ గారిలోని విశ్వాసాన్ని మేధాసంపత్తిని గుర్తించి పీటర్ గారిని గొప్పప్రయోజకున్నిచేశారు.అందుకు కృతజ్ఞతగా ఆయన పేరును పీటర్ గారు తనపేరు నందు చేర్చుకున్నారు.ప్రాపంచిక జీవితంపై విరక్తికలిగిన పీటర్ గారు క్రీ.శ.1034లో బెనడిక్ట్ సభలో చేరి మఠవాసిగా మారారు. క్రీ.శ.1042లో ఫోంటే అవెల్లాన మఠానికి ప్రధాన సన్యాసిగా నియమింపబడి సన్యాసుల ఆరోగ్యక్షీణతకు కారణమైన మఠ కఠిననిబంధనలను సడలించి, గొప్ప మఠ సంస్కర్తగా పేరొందారు.వీరికి మరియతల్లి పై మక్కువ ఎక్కువ.పీటర్ గారు తన స్నేహితుడైన ఫాదర్ హిల్టెబ్రాండుతో కలిసి అనేక సన్యాసుల ఆశ్రమాల్ని నెలకొల్పారు. ఈ హిల్టెబ్రాండు గారే 1073-1085 మధ్యకాలంలో 7వ గ్రెగోరి పోపుగా శ్రీసభను పాలించారు. పీటర్ గారు గురువులలో చైతన్యం నింపుటకు మరియు శ్రీసభ ఔన్నత్యాన్ని చాటుటకు అనేక గ్రంధాలను రచించి శ్రీసభపండితునిగా పేర్గాంచారు. క్రీ.శ 1057లో 10వ స్టీఫెన్ పోపుగారి ఒత్తిడితో ఒస్తియా పీఠానికి,గుచ్చియో పీఠానికి బిషప్పుగా వున్న పీటర్ గారు కార్డినల్ గా నియమింపబడ్డారు. వీరు 7గురు జగద్గురువులకు సలహాదారునిగా సేవలందించారు. క్రీ.శ.1072లో తలనొప్పితో పీటర్ దమియెన్ గారు పరలోకప్రాప్తినొందారు.
పునీత పీటర్ దమియెన్ గారా మాకొరకు ప్రార్థించండి!
బంగారు మాట:
ఏవ ద్వారా ఈ భూమిపైకి
శాపము వచ్చింది కానీ
మరియతల్లి తన ద్వారా
ఈ భూమిపైకి దీవెనను
తీసుకొనివచ్చింది.
పునీత పీటర్ దమియెన్
