గురుత్వ జీవితం శ్రేష్టమైనది - పోప్

జోసెఫ్ అవినాష్

20 Feb 2026

విశ్వ కాపరి పోప్ లియో XIV ఫిబ్రవరి 19న రోమ్ ప్రాంత దైవాంకితులతో సమావేశమై వారితో ముచ్చటించారు.కాలం వేగంగా మారుతోంది,ప్రజల్లో ఆధ్యాత్మిక ఆసక్తి తగ్గుతోంది, సేవలో అలసట కూడా కలుగుతోంది.అయినప్పటికీ నిరుత్సాహపడకూడదని ఆయన స్పష్టం చేశారు.దేవుడు ఇచ్చిన పిలుపును మళ్లీ జ్వలింపజేసుకొని,విశ్వాసంలో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. గురువులు ఒంటరిగా కాకుండా పరస్పరం సహకారంతో పనిచేయాలని ఆయన సూచించారు.ఒకే విచారణ పరిధిలో కాకుండా, కుటుంబాలు మరియు యువతను చేరుకునే విధంగా కలిసికట్టుగా సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫలితాలు వెంటనే కనిపించకపోయినా,సహనం కోల్పోకుండా విశ్వాసంతో కొనసాగాలని,ముఖ్యంగా యువ గురువులు తమ కష్టాలను పరస్పరం పంచుకొని ఐక్యతను పెంపొందించుకోవాలని ఆయన ప్రేరేపించారు.మొత్తంగా చూస్తే, ఈ కాలంలో అత్యంత ముఖ్యమైన కర్తవ్యం సువార్త ప్రకటనే అని ఆయన గుర్తుచేశారు.దేవుని నుండి దూరమవుతున్న వారికి ప్రేమతో,దగ్గరగా ఉండి క్రీస్తు సందేశాన్ని మళ్లీ చేరవేయడం గురువుల ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN