మరణం – నిత్య జీవితానికి ప్రవేశ ద్వారం

సిస్టర్ అండ్ర రాజకుమారి సి.ఎస్.ఏ
02 Nov 2025
మరణం అనేది అంతం కాదు,అది నిత్యజీవితానికి ద్వారం. మనిషి భౌతిక జీవితాన్ని పూర్తిచేసి దేవుని సన్నిధిలోకి ప్రవేశించే పవిత్ర క్షణం అది.ఈ లోకంలో మనం చేసిన సత్కార్యాలు, ప్రేమ, క్షమ, దయ ఇవన్నీ మనకు నిత్యజీవితానికి బాటలు అవుతాయి.
ఆత్మల పండుగ రోజున మనం మరణించిన విశ్వాసులను గుర్తుచేసుకుంటాం.వారి కోసం ప్రార్థిస్తూ,దేవుడు వారికి నిత్యశాంతి ప్రసాదించమని వేడుకుంటాం.ఈ పండుగ మనకు జీవితం తాత్కాలికమని,కానీ దేవుని ప్రేమ నిత్యమని గుర్తు చేస్తుంది.
మనమూ ప్రతి రోజు మన స్వీయ ఆత్మ పరిశుద్ధత కోసం కృషి చేస్తూ, స్వార్థం, అహంకారం, పాపం లాంటి వాటికి "మరణం" చెంది, క్రీస్తుతో కలసి నూతన జీవితాన్ని పొందాలి.
ప్రార్థన:
ప్రభువైన యేసయ్యా,
ఈ రోజు మేము నీ సన్నిధిలోకి
పిలిచిన విశ్వాసుల ఆత్మలను
జ్ఞాపకం చేసుకుంటున్నాము.
వారి ఆత్మలకు నిత్యశాంతి ప్రసాదించు.
వారు నీ ప్రేమలో నిత్యానందంలో
నివసించునట్లు కృపనీయుము.
మా జీవితాలను పవిత్రతతో నింపి,
ప్రతిదినము నీ చిత్తానుసారంగా
జీవించడానికి మమ్మల్ని నడిపించుము.
మరణం అంతముకాదు,
నీతో కలిసే పవిత్ర మార్గమని
మాకు గుర్తు చేయుము.
నీ కరుణా సింహాసనం ముందు
విశ్వాసముతో నమస్కరిస్తూ,
మేము నీలో నిత్యజీవితానికి
అర్హులమగునట్లు దీవించుము,ప్రభువా
ఆమెన్....
