"నేటి వాక్పఠనం - కవన ధ్యానం "

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

01 Nov 2025

తే.గీ:
తండ్రి చిత్తాను సారియై ధరణి యుండు
తనయునే ఆచరించగా ధరణి యుండు
ఎంత చేరినన్ చివరంట చెంత నుండు
నెట్టి వేయడు ప్రభు ,తన మెట్టు నుండి

దేవుని ఆజ్ఞను శిరసా పాటించే వాడు ప్రభువైతే , ప్రభుని మాటను ధిక్కరించక అనుసరించెడి వారు ఈ ధరా ప్రజలు. ఏది ఏమైనా ప్రభువు ప్రజల పట్ల దయా మయుడు ఆదరణ కర్త. చెంతకు చేరిన వారికి తగిన ఆశ్రయం ఇస్తాడు. విడిచి పెట్టడు. పొమ్మని చెప్పడు.
(యోహాను 6:37-40)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN