"నేటి వాక్పఠనం -కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
03 Oct 2025
Ref: పునీత లూకా 10:17-24
కం:
ధన్యములై మా కన్నులు
అన్యములే కాంచకన్ త్వదానన మందే
జన్యము లై ప్రభు మోక్షా
గణ్య మహా కాంతి మంత గమ్యము లందెన్
భావం:
ప్రభూ!! నిజంగానే ఎంతటి అదృష్ట వంతులమో కదా!
మిమ్ము చూచిన మా కన్నులు ధన్యమైపోయాయి.
ఇక అన్య సౌందర్యా లేమై నా ఉన్నా ,వాటిని చూడడానికీ అయిష్టత చూపించేస్తాయి.ప్రస్తుతం నీతో పాటు జీవిస్తూ ఉన్న మేము మా బ్రతుకులూ ఎంతటి సౌభాగ్యవంతాలో కదా!మీ ముఖ కాంతి దర్శిస్తూ అగణ్యమైన మోక్షశ్రీ గమ్యానికి చేరినట్టే కదా స్వామీ!
(ఇవి నా "గాథా సహస్ర వతి" - ప్రభు గాథల్లో నుంచి గ్రహింప బడ్డాయి)
