పోప్ గారిని కలిసిన కర్నూలు పీఠ కాపరి

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
03 Oct 2025
విశ్వ కతోలిక శ్రీసభ కాపరి పోప్ లియో-XIV ను కర్నూలు పీఠాధిపతులు మహా.ఘన. శ్రీశ్రీశ్రీ .గోరంట్ల జ్వాన్నేష్ తండ్రిగారు బుధవారం మధ్యాహ్నం 2:30 సమయంలో వాటికన్ సిటీలో అధికారపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గోరంట్ల జ్వాన్నేస్ తండ్రి గారు మాట్లాడుతూ పరిశుద్ధ పాపుగారు కర్నూలు పీఠ విశ్వాసులకు శుభాకాంక్షలు,ఆశీర్వాదం అందజేశారన్నారు. పీఠం సమగ్రాభివృద్ధిలో వాటికన్ తనపాత్ర పోషిస్తుందని తెలిపారన్నారు.విశ్వాస యాత్రలో కర్నూలు పీఠం విశ్వాసులు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారని పేర్కొన్నారు. కాగా నూతనంగా ఎన్నికైన పోప్ లియోను,ఏడాది క్రితం కర్నూలు పీఠాధిపతులుగా బాధ్యతలు స్వీకరించిన గోరంట్ల జ్వాన్నేస్ తండ్రిగారు కలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. మొదటిసారి పోప్ గారిని కలవడంతో జ్వాన్నేష్ తండ్రి గారు ఆనందపరవశులయ్యారు.
