సిస్టర్స్ కు బెయిల్ మంజూరు

జోసెఫ్ అవినాష్
02 Aug 2025
నారాయణపూర్‌కు చెందిన ముగ్గురు బాలికలను బలవంతంగా మతమార్పిడి చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో గత నెల 25న ఛత్తీస్‌గఢ్‌లో కేరళకు చెందిన కతోలిక కన్య స్త్రీలైన సిస్టర్ ప్రీతి మేరీ, సిస్టర్ వందన ఫ్రాన్సిస్ లు అన్యాయముగా అరెస్టు కాబడిన విషయం విధితమే.వీరికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ NIA కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.డిఫెన్స్ న్యాయవాది అమృత్ దాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయిందని శుక్రవారం బెయిల్ విచారణ తర్వాత, విచారణ కోసం ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ అడగలేదని,ఆరోపించిన బాధితులను వారి ఇళ్లకు తిరిగి పంపించామని దాస్ అన్నారు. అరెస్టు కాబడిన దగ్గర నుండి సిస్టర్స్ విడుదల కావాలని వివిధ క్రైస్తవ సంఘాలు ప్రత్యేక శాంతి ర్యాలీలు, ప్రార్థనలు చేస్తున్న విషయం విధితమే.సిస్టర్స్ కు బెయిల్ మంజూరు కావడంతో క్రైస్తవ విశ్వాసులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
