యువత ప్రపంచానికి వెలుగుగా ఉండాలి - పోప్ లియో XIV
జోసెఫ్ అవినాష్
02 Aug 2025
రోమ్ వేదికగా యువజన జూబిలీ వేడుకలు జూలై 28న ఆరంభమయ్యాయి.ఇవి ఆగస్టు 3 తో ముగుస్తాయి.ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుండి యువత రోమ్ కు భారీగా తరలివస్తున్నారు.వీరిని ఉద్దేశించి పోప్ ప్రసంగించారు.యువత ప్రపంచానికి వెలుగుగా జీవించాలని ఆయన కోరారు.మీరు ఇక్కడ సమావేశమై ఆనందోత్సాహాలతో చేస్తున్న కేరింతలు,ఉత్సాహం బూదిగాంతముల వరకు వినిపిస్తాయని ఆయన అన్నారు.యువత నిజ నిరీక్షణకు చిహ్నాలుగా ఉండాలని,ముఖ్యంగా చీకటితో నిండిన ఈ ప్రపంచానికి వెలుగును తీసుకొచ్చే శక్తిగా మీరంతా ఉండాలని, క్రీస్తుని అడుగుజాడల్లో నడుస్తూ, ప్రపంచంలో శాంతి స్థాపనకై నడుం బిగించాలని ఆయన యువతను ఆదేశించారు .
