ధర్మ పోరాటం క్రైస్తవ నైజం

జోసెఫ్ అవినాష్
01 Aug 2025
సామాన్య 17వ శనివారం
లేవి 25:1,8-17
కీర్తన 67:2-3,5,7-8
మత్తయి 14:1-12
ధ్యానం:
నేటి సమాజంలో మానవుడు ధర్మాన్ని,సత్యాన్ని స్వీకరించలేకపోతున్నాడు. సత్యాన్ని ధర్మాన్ని మాట్లాడే వ్యక్తిని ఒక పిచ్చివానిలా చూస్తుంది.అసత్యం,సత్యం ముందు వణుకుతుంది.అధర్మం,ధర్మం ముందు నిలువజాలదు. అన్యాయం న్యాయముందు ఓడిపోతుంది.ఇది ముమ్మాటికీ నిజం.నేడు సమాజములో అసభ్యకరమైన జీవితమును జీవిస్తున్నవారు చాలామంది వున్నారు. జ్ఞానస్నానంలో మనం పాప కార్యములకు స్వస్తి చెప్పాం.పుణ్యమార్గంలో నడుచుకుంటామని ప్రమాణం చేశాం.ఈనాటి సువార్తలో స్నాపకుడగు యోమాను న్యాయం,ధర్మం,సత్యం కోసం చివరి క్షణం వరకు పోరాటం చేశాడు.చివరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్నే ఫణంగా పెట్టాడు.సత్యవంతులు మరో శక్తివంతులు.అవినీతి రాజ్యమేలి సత్యానికి సాక్ష్యం పలుకవలసి వచ్చినప్పుడు నీ మాట ఎటు? ఎటువైపు నీ అడుగు? కనుక దేవునికి ప్రమాణికమైన బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.మనల్ని పాప మాలిన్యం నుండి దూరం చేయమని పుణ్యమార్గములో నడుచుటకు కావలసిన దీవెనలు ఇవ్వమని ప్రభుని మనసారా వేడుకొందాము.
