జూలై మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
జోసెఫ్ అవినాష్
04 Jul 2025
జగద్గురువులు పోప్ లియో XIV జులై మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించారు.మన జీవితానికి సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలో మరియు క్రీస్తు నుండి మనల్ని దూరం చేసే అనవసరమైన వాటిని తిరస్కరించడం ఎలాగో తెలుసుకునేందుకు మంచి వివేచనను ప్రసాదించమని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ఆయన కోరారు. పవిత్రాత్మ మనం మంచి నిర్ణయాలు తీసుకునే విషయంలో సహాయపడుతుందని, ప్రతి ఒక్కరూ దేవుని స్వరాన్ని ఆలకించాలని ఆయన కోరారు. మనల్ని దేవుని నుండి దూరం చేసే వాటిని తిరస్కరించి, ఆయనను ప్రేమించి, సేవించు లాగున మంచి వివేచన వరాన్ని ప్రసాదించమని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ఆయన కోరారు.
