ఆలోకనం ఆవిష్కరణ

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
03 Jul 2025
కర్నూలు పీఠం,తాడిపత్రి విచారణ ముద్దుబిడ్డ డా.।।క ల్లూరు ఆనందరావు గారి రచన "ఆలోకనమ్" పుస్తకావిష్కరణ సభ 02.07.2025న హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగ రాయ గాన సభలో జరిగింది. డా.ఆనందరావు రచన ఆలోకనం పుస్తక ఆవిష్కరణకు నేను కూడా వెళ్ళటం జరిగింది.ఆయన ఒక ఆదర్శవంతుడుగా నాకు అనిపించాడు.ఒక సామాన్య దళిత పేద కుటుంబంలో పుట్టిన వీరు,తన తలరాతను మార్చుకోవడానికి ఎంతో శ్రమించారు.తెలుగు పండితుడుగా తనను తాను తీర్చిదిద్దుకున్న మహనీయుడు.
ఆచార్య కొలకలూరి ఐనాక్ గారు మరియు ఇతర ప్రముఖులు డాక్టర్ కల్లూరు ఆనందరావు గారి జీవిత చరిత్రను మరియు తెలుగు సాహిత్యానికి ఆయన చేసుతున్న గొప్ప రచనలు గురించి వివరించారు.మన కతోలిక తెలుగు బిడ్డ తెలుగు సాహిత్యం గురించి ఎన్నో వ్యాసాలు రాసి,ప్రముఖుల నుండి ప్రశంసలు పొందినారు.